బీజేపీ నాయకుడు సత్యకుమార్ కు ధర్మవరం టిక్కెట్ ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. పొత్తుల భాగంగా బిజెపి నాయకుడు సత్యకుమార్ కు ధర్మవరం టిక్కెట్ ఖరారు అయిందంటూ ప్రచారం చేస్తున్నారు. ధర్మవరం టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే సూర్యానారాయణకు కేటాయించాలంటూ ఇవాళ ర్యాలీకి పిలుపు నిచ్చారు ఆయన మద్దతు దారులు.

దీంతో దర్మవరం పట్టణంలోని గాంధీ నగర్ నుంచి బిజెపి కార్యాలయం వరకు ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ధర్మవరం టిక్కెట్ శ్రీరామ్ కేటాయించాలంటూ ర్యాలీ నిర్వహించారు టిడిపి కార్యకర్తలు.జనసేన కు టిక్కెట్ ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేసిన చిలకం మధుసూదన్ రెడ్డి.