తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంట గంటకు పెరుగుతోంది వరద నీటిమట్టం. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ లో ప్రస్తుత నీటిమట్టం 12.5 అడుగులుగా ఉంది.
బ్యారేజ్ 175 గేట్ల నుంచి 10 లక్షల 97 క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇవాళ ధవళేశ్వరం వద్ద మరింత గోదావరి వరద పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు ఉప్పొంగుతున్నాయి. ఇటు లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.