“మనలోకం” ప్రత్యేకం: ఎస్సీలను దూరం చేసుకున్న బాబు.. బీసీలను దగ్గర చేసుకున్న జగన్!

-

ఈ లోకంలో ప్రతీ వ్యక్తీ ప్రతీ రోజూ అప్ డేట్ అవుతూ ఉండాలని అంటారు. మారుతున్న కాలం, కొత్తగా వస్తోన్న జనరేషన్, అప్ డేటెడ్ టెక్నాలజీలతో పాటుగా మనం కూడా అప్ డేట్ అయితేనే కాలంతో పాటు ప్రయాణించగలుగుతాం… అలాకానిపక్షంలో “మిగిలిపోతాం”. ఇది మిగిలినవారందరికీ ఎలా సూటవుతుందన్న విషయం కాసేపు పక్కనపెడితే… రాజకీయనాయకులకు మాత్రం మరీ ఎక్కువగా సూటవుతుంది. ఇంకా పాతచింతకాయ పచ్చడి ప్లాన్లూ, రొటీన్ రొట్ట రాజకీయాలు చేస్తానంటే కుదరని రోజులివి. పక్కాగా ప్లాన్ చేసుకుంటూ, నలుగురిని కలుపుకుంటూ, తానుపట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా నడిస్తే జరిగే రోజులు కావివి. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది… బాబు – జగన్ ల వ్యవహారం!

ఎస్సీలుగా పుట్టలని ఎవరు కోరుకుంటారు అనేస్థాయిలో మాట్లాడారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలే కాదు అవి! సంస్కారం, విజ్ఞత ఉన్నవారి నోటినుంచి వినాల్సిన మాటలే కాదు అవి. కానీ.. బాబు నోటివెంట జాలువారాయి. ముఖ్యమంత్రే అనగా లేనిది మంత్రిని అంటే వచ్చిందా అన్నట్లుగా… ఆదినారాయణరెడ్డి కూడా నోరు జారారు. అనంతరం మరికొందరు… ఇలా దళుతులపై పిచ్చి ప్రేళాపను చేసేటప్పటికి… ఆ వర్గం బాబుకి దాదాపు దూరమయ్యిందనే వార్తలు వచ్చాయి.. ఫలితాలు 2019లో కనిపించాయి.

ఆ బాబు & కోల పాతచింతకాయ ఆలోచనలకు, రొట్ట రాజకీయాలకు దూరమయిన ఎస్సీల విషయంలో జగన్ చాలా క్లియర్ గా మాట్లాడారు! బాబుకు చురకలు అంటిస్తూనే… ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అలోచనలు ఏమిటి చెంప పగలగొట్టేవాడు లేక అన్నట్లుగా సమాధానాలు ఇస్తూనే… “నేను మామా అనిపిలిచే చాలా మంది.. మా కుటుంబంలో దళితులే” అని క్లారిటీ ఇచ్చారు. దీంతో దళితులకు జగన్ ఎంతో దగ్గరయిపోయారు. జగన్ ఆ వర్గాన్ని దగ్గర చేసుకున్నారా.. ఆ వర్గమే జగన్ కు దగ్గరైందా అనే పనికిరాని లాజిక్కులు కాసేపు పక్కనపెడితే… జగన్ – దళితులు ఒకటే అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో బాబు దృష్టంతా బీసీలపై పడింది. మహానాడు వేదికగా.. గతంలో కొన్ని కారణాల వల్ల, అభివృద్ధిపైనే దృష్టంతా పెట్టడం వల్ల బీసీలను కాస్త పట్టించుకోలేకపోయాను అని బాబు అంటే… బీసీలు ఎందుకో కానీ వారికి ఎంతచేసినా కూడా మమ్మల్ని నమ్మలేదు అంటూ అచ్చెన్నాయుడు లాంటి నేతలు సన్నాయినొక్కులు నొక్కారు. అక్కడితో ఆగని బాబు… బీసీ నేతనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చేయాలని భావిస్తున్నారట. బాబు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూన్న క్రమంలో… బీసీలు బాబు మాటలను నమ్ముతారా, కొంగ జపంలాగానే చూస్తారా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే… మాటలతో కాకుండా, చేతలతో.. ఆ వర్గాల మనసులు దోచుకుని, ఆ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే పనులపై పూర్తి దృష్టి కేంద్రీకరించారు జగన్!

అవి.. నవరత్నాల ద్వారా అధికమొత్తంలో బీసీలకు అందించిన ఆర్థిక ప్రయోజనాలే! బీసీల ప్రభుత్వం అని చెప్పుకున్న గత ప్రభుత్వంలో సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలనే నమ్ముకున్న బీసీలలకు.. జగన్ సర్కార్ ద్వారా అధిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్న సమయం ఇది! ఈ క్రమంలో నవరత్నాలతోపాటు ఏడాది కాలంలో 15 పథకాల ద్వారా ఏకంగా 1.78 కోట్ల మందికి పైగా బీసీలకు రూ.19,308 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం అందించింది జగన్ ప్రభుత్వం. తన పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో “బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌” అంటూ కొత్త నిర్వచనం చెప్పి… ఆ బీసిలకు బ్యాక్ బోన్ గా నిలబడే పథకాలు అమలుచేస్తున్నరని అంటున్నారు!

గడిచిన ఏడాది కాలంలో బీసీలకు లబ్ధి చేకూరిన పథకాలు, ప్రభుత్వం అందించిన ఆర్థిక వివరాలను ఇప్పుడు చూద్దాం…

రైతుభరోసాలో 23.29 లక్షల మంది బీసీ రైతులకు రూ.4,780 కోట్లు

జగనన్న అమ్మఒడి కింద 19.65 లక్షల మంది బీసీ తల్లుల ఖాతాల్లో రూ.2,948 కోట్లు

జగనన్న వసతి, విద్యా దీవెనలో 16.73 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.2,236 కోట్లు

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లో 3.26 లక్షల బీసీలకు రూ.792 కోట్లు

వైఎస్సార్ సున్నావడ్డిలో 48.38 లక్షల బీసీలకు రూ.720.16 కోట్లు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకలో 28.87 లక్షల బీసీలకు రూ.7,239 కోట్లు

వైఎస్సార్ వాహనమిత్ర లో 1.07 లక్షల బీసీలకు రూ.107 కోట్లు

వైఎస్సార్ నేతన్న నేస్థంలో 71వేల బీసీలకు రూ.172 కోట్లు

మత్స్యకార భరోసాలో 1.07 లక్షల బీసీలకు రూ.210 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version