విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు , కార్మికులు కుదింపునకు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. త్వరలో 2 వేల మూడు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలిగించే దిశగా ఉక్కు యాజమాన్యం ఆలోచన చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఉక్కు ఉద్యోగులకు VRS ప్రకటించింది యాజమాన్యం. ఇప్పటికే VRSకు 600 వరకు అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెలాఖరు వరకు గడువు ఉందట.
రెండో విడత VRS ప్రకటించే అవకాశం ఉంది. 11 వేల 440 కోట్లు ప్యాకేజీ తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నాయి.2025 డిసెంబర్ నాటికి 1218 మంది ఉక్కు ఉద్యోగులు రిటైర్మెంట్ కానున్నారు. మానవ వనరులు తగ్గింపు, రిటైర్మెంట్ కారణంగా 8 వేలకు తగ్గిపోనున్నారు పర్మినెంట్ ఉద్యోగులు. ఇతర సంస్థ లతో మెర్జ్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉక్కు యాజమాన్యం వినియోగించుకుంటుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు అప్పులు, వడ్డీలకు, ఉద్యోగుల VRS కి, రిటైర్మెంట్ కి, ప్యాకేజీ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.