రేపటి నుంచి JEE మెయిన్స్ ఎగ్జామ్స్.. విద్యార్థులు ఇవి మర్చిపోవద్దు

-

ఆలిండియా లెవల్ జేఈఈ మెయిన్స్ -2025 సెషన్ వన్ పరీక్షలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను NTA ఇప్పటికే పూర్తి చేయగా.. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. ఈనెల 22, 23, 24, 28, 29, 30వ తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి.ఈక్రమంలోనే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కింద పేర్కొన్న విషయాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ఎన్టీయే స్పష్టంచేసింది.

* విద్యార్థులు అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి, లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును వెంటబెట్టుకెళ్లాలి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదైనా ఒకటి సరిపోతుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన టైంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి.
* విద్యార్థులు బాల్ పాయింట్ పెన్ మాత్రమే పరీక్ష రాసేందుకు వాడాలి.
* దివ్యాంగులైన విద్యార్థులు మెడికల్ సర్టిఫికెట్ క్యారీ చేయాలి.
* జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, డాక్యుపెన్ వంటివి నిషేధితం.
* ఎక్కువ పాకెట్స్ ఉన్న బట్టలు ధరించరాదు. నగలు,మెటాలిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

 

Read more RELATED
Recommended to you

Latest news