తెలంగాణలో ఒకే రోజు 4 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై..కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదంటూ మండిపడ్డారు. రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిదంటూ ఆగ్రహించారు.
తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అంటూ నిప్పులు చెరిగారు. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు అన్నారు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు… రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయన్నారు. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయని తెలిపారు కేటీఆర్.
ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది! రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!
ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది..
తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్
ఆత్మహత్యలు కాదివి… pic.twitter.com/u70SmU5tlb— KTR (@KTRBRS) January 21, 2025