పల్నాడు మండలం క్రోసూరులో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ కిట్లు అందించనుండగా రూ.1042 కోట్ల ఖర్చుతో 43 లక్షల మందికి కిట్లు పంపిణీ చేయనున్నారు.
కాగా, ఈ కిట్లలో నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్ట్, బ్యాగ్, యూనిఫామ్ ఉంటాయి. ఇది ఇలా ఉండగా, నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలు ఈనెల 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని స్కూల్స్ ఒంటిపూట బడులను నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది.