తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తవుతున్న నేపథ్యం, కేసును సీబీఐకు అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు గుర్తించామని చెప్పారు.
అదే రోజు ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ బయల్దేరారని, కొంతమూరు పెట్రోల్ బంకు వద్దకు రాత్రి 11.42కు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయని చెప్పారు. పాస్టర్ మృతిపై అనుమాలు వ్యక్తమవున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. పాస్టర్ మృతిపై విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని, అసత్య ప్రచారాలు చేయొద్దని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు.