స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది. మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ పై ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.
టీడీపీ అధినేత చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఐడీ పిటిషన్ పై ఎలాంటి విచారణ కూడా చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 19 వరకు ఎలాంటి విచారణ చేయపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.