క్రిస్టియన్ గా చెప్పుకున్న పవన్ ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా..? అని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ తిరుమల డిక్లరేషన్ వివాదం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జగన్ ను గతంలో డిక్లరేషన్ అడగలేదని, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ బాప్టిసం తీసుకున్నానని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేశారు.
డిక్లరేషన్ ఇచ్చే సోనియాగాంధీ శ్రీవారిని దర్శించుకున్నారా..? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల శ్రీవారి పరువు తీస్తున్నారని మండి పడ్డారు నారాయణ స్వామి. కుల, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. తిరుమల లడ్డు వివాదం పై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని నారాయణ స్వామి తెలిపారు.