ఏంటి విష్ణూ ఇంత మాట అనేసావ్..? నిఖిల్ పై ఘోరంగా కామెంట్స్..!

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. హౌస్ లోకి రెండు మూడు వారాల్లో 12 మంది వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇస్తారని బిగ్ బాస్ చెప్పారు. ఆ 12 మందిని హౌస్ లో ఉన్న వాళ్లు బయటకు రాకుండా చేయాలనీ.. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్ ఇస్తున్నారు. బెలూన్ టాస్క్ లో సీత క్లాన్ విన్ అయింది. దాంతో నిఖిల్ క్లాన్ నుంచి ఒకరికి తప్పించాలని.. అది తన టీం డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. తర్వాత బిర్యాని టాస్క్ ఇస్తే 45 నిమిషాల్లో పూర్తి చేయలేక సోనియా, నబీల్ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు.

సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్లో పట్టుకునే ఉండు లేకపోతే పగిలిపోతుంది అని ఇచ్చిన టాస్క్ లో పృథ్వి గెలిచాడు. ఓడిపోయిన సీత క్లాన్ నుంచి అనర్హులు అనుకునే వారిని తీసేయాలని నిఖిల్ టీం డిసైడ్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. నబీల్ ని టాస్క్ నుంచి తీసేసారు. నబీల్ ని తీసేయడంతో సీత క్లాన్ డిసప్పాయింట్ అయింది.

నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి 2 ఫేస్డ్ ఉన్న వ్యక్తిని చూడలేదు అనుకుంటూ విష్ణు ప్రియ వెళ్ళిపోయింది నీకు అలా అనిపిస్తుందా థాంక్యూ అని నిఖిల్ చెప్పాడు. నబీల్ ని ఎందుకు తీసావ్ అని కిర్రాక్ సీత అడిగింది. ఇక్కడ వద్దు పర్సనల్ గా తనకు చెప్పు అని పృథ్వి అనడంతో సీతను పక్కకు తీసుకువెళ్లి చెప్తాడు. సీత ఒప్పుకోదు చీఫ్ పొజిషన్ లో ఉండి చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు చేతులు కట్టుకుని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు పెట్టుకోవడం ఒకటే తక్కువ అలా అని నేను ఆడవాళ్లు తక్కువ చేయట్లేదు అని విష్ణు ప్రియ అంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version