ప్రముఖ మహాకవి గుర్రం జాషువా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డ పాడులో జన్మించిన జాషువా తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో జాషువాకు చిన్నప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే.. తిరగబడి వారిని కొట్టాడు. తెలుగు పండితుడిగా, రెండో ప్రపంచ యుద్ద ప్రచారకుడిగా పని చేశాడు జాషువా. బొమ్మలు గీయడం, పాటలు పాడటం చేసేవాడు. రచయిత పిచ్చయ్య శాస్త్రి సమచర్యంతో కవిత్వం పై ఆసక్తి కనబరిచి తన ప్రతిభను నిరూపించుకున్నారు. 36 గ్రంథాలు, ఎన్నో కవిత కండిఖలు రాశాడు జాషువా. ఇవన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ జాషువా జయంతి.
గుర్రం జాషువా జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో “గబ్బిలం “ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు జగన్.