టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగంపై పురందేశ్వరికి తెలియదా..? – మంత్రి అమర్నాథ్

-

గత నాలుగు ఏళ్లలో వైసిపి ప్రభుత్వం 7.14 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని ఆరోపించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. అందులో అనధికార అప్పులే నాలుగు లక్షల కోట్లకుపైగా ఉన్నాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పురందేశ్వరి. అయితే పురందేశ్వరి వ్యాఖ్యలపై తాజాగా కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పై పురందేశ్వరికి అవగాహన లేదా..? అని ప్రశ్నించారు.

ప్రజలకు అవసరమైనంత నిధులను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని చెప్పుకొచ్చారు. పురందేశ్వరి మరిది చంద్రబాబు హయాంలో అప్పులు చేశారని, మరి నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. టిడిపి హయాంలో నిధుల దుర్వినియోగం పై పురందేశ్వరికి తెలియదా..? అని నిలదీశారు అమర్నాథ్. కొన్ని అప్పులు చేసినా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version