ఎన్టీఆర్ మనవళ్ళుగా పుట్టి ట్వీట్లు చేయడం కాదు ముందు ఆ పని చేయండి – మాజీ మంత్రి అనిల్

-

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు.

ఒకరి పేరు తీసేసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేస్తూ.. ఈ నిర్ణయం తనని చాలా బాధించిందంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ట్వీట్లపై స్పందించారు నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, చెప్పులయించిన ఘనత చంద్రబాబుకి దక్కిందని విమర్శించారు.

నందమూరి కుటుంబం నుంచి టీడీపీ పార్టీని నారావారి కుటుంబం గా మార్చుకున్నప్పుడు ఎన్టీఆర్ మనవాళ్ళు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ముందు దానిపై పోరాడాలని అన్నారు. నందమూరి అంటే ఒక బ్రాండ్.. ఆయన మనవళ్లు గా పుట్టి ట్వీట్లు చేయడం కాదు.. ఆ పార్టీని లాక్కోండి అన్నారు. ఆ పార్టీ మీది.. ముందు దానికోసం తొడలు కొట్టండి రా.. ఊరికే సౌండ్ ఎందుకు?. అన్నారు అనిల్ కుమార్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version