ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజు అసత్యాల బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతి కాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎం కుసుమ్, సూర్యగర్ పథకాల వల్ల నష్టం ఏంటో జగన్ చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రయోజక పథకాలైన సూర్య ఘర్, పీఎం కుసుమ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ మరింత మెరుగ్గా అందించవచ్చు అని పేర్కొన్నారు. రైతులకు ఫీడర్ లేవన్లోనే నాణ్యమైన విద్యుత్తును జగన్ వద్దంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విదత్తు గృహ వినియోగదారులకు అందుతుందని తెలిపారు మంత్రి గట్టిపాటి రవికుమార్.