పుస్తకాలు, పాఠశాలల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండొద్దు – నారా లోకేష్‌

-

 

ఇక పై విద్యా వ్యవస్థ లో రాజకీయ జోక్యం లేకుండా చేస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్‌. రాజకీయ నాయకుల ఫోటోలు స్కూల్ లో ఉండకూడదు, స్కూల్ బుక్స్ లో కూడా ఉండకూడదని ఆదేశించారు. కేజీ నుండి పీజీ వరకు , విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు చేస్తామని తెలిపారు. పాఠ్య పుస్తకాలలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని వివరించారు లోకేష్‌.

నేను స్టాన్ ఫోర్డ్ లో చదివాను…ఏపీలో కూడా ఆ రూల్స్‌ అమలు చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్‌. బాపట్లలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడారు. నేను స్టాన్ ఫోర్డ్ లో చదువుకుని, కొన్ని విషయాలు నేర్చుకున్నాను.. పరీక్షా కేంద్రాల్లో, టీచర్లు గానీ ,ఇన్విజిలేటర్లు అక్కడ ఉండరని తెలిపారు. ఐనా ఎవరూ పక్క వాళ్ళ పేపర్ కోసం,కాపీయింగ్ కోసం చూడరు… అలాంటి విద్యా వ్యవస్థ ఇక్కడ కూడా రావాలన్నారు.

పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను…ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాల్ల తల్లి దండ్రులు అంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం , విద్యార్థుల తల్లిదండ్రుల తో ,ఉపాద్యాయుల తో కలిపి సమావేశం పెట్టామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం పై కూడా ,ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. గడిచిన ఐదేళ్ల లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఆగ్రహించారు. గాడి తప్పింది , అలా గాడి తప్పిన, విద్యాశాఖను గాడిలో పెట్టే బాధ్యత సీఎం నాకు అప్పగించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version