హైడ్రా యంత్రాంగంపై అధికార పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.అక్రమ నిర్మాణాలకు హైడ్రా నోటీసులు ఇచ్చిన అనంతరం లావాదేవీలు నడుపుతున్నదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం అనిరుధ్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేకే హైడ్రా కమిషనర్ స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్ల నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.