ఆస్తి కాదు.. మనిషిలో ఆలోచన ముఖ్యం : సీఎం చంద్రబాబు

-

ఆస్తి కాదు.. మనిషిలో ఆలోచన ముఖ్యం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విజన్ 2047 విజయవంతం చేయడానికి 10 సూత్రాలు ముఖ్యం అని తెలిపారు. విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. జిల్లాల్లో ఆర్థిక పరిస్థితి పెరగాలి. ఫస్ట్ రాష్ట్రం, జిల్లా, మండలాల ఆర్థిక పరిస్తితిని అంచెనా వేయాలని సూచించారు. నియోజకవర్గం ఆస్తి ప్రజలే అన్నారు.

కొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగితే.. మరికొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు చేప ఇస్తూనే చేపలు పట్టే విధానాన్ని నేర్పాలన్నారు. మున్సిపాలిటీలు, మండలాల వారిగా విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం అయిందని తెలిపారు సీఎం చంద్రబాబు. గర్వంగా చెబుతున్నాను.. గతంలో రాయలసీమను రతనాల సీమగా మార్చామని గుర్తు చేశారు. సొంత ఇళ్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంబ్లు, గ్రామాల్లో 3 సెంట్లు కల్పించి ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. కొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయంతో పాటు జీడీపీఎస్ తక్కువగా ఉందని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version