ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్షనేత అసెంబ్లీలో ప్రతిపాదించగా.. ఎంఐఎం నేతలు అడ్డు తగిలారు. దీంతో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య తీవ్ర వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ప్రతిపాదన కంటే ముందు.. సీఎం రేవంత్ పొట్టి శ్రీరాములు యూనివర్సటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెడతామని ప్రకటించారు. అయితే, ఓయూకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరగా.. సిగ్గు, శరం ఉందా అంటూ ఎంఐఎం నేత తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.దీంతో ఇరుపార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.