AP: బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు.. కోడి మాంసం తినొచ్చు.. అంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు.. కోడి మాంసం తినొచ్చు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైరస్ ఉధృతి, నివారణ చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రంలో 10.78 కోట్ల కోళ్లు ఉన్నాయని.. అందులో కేవలం 5 లక్షల 42 వేల కోళ్లు మాత్రమే బర్డ్ ఫ్లూతో చనిపోయాయని చెప్పారు. సోషల్ మీడియాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయని ప్రచారం జరుగుతోందని ఆగ్రహించారు మంత్రి అచ్చెన్నాయుడు. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శాంపిల్స్ ను భోపాల్ కు పంపిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు.