యువతిపై పెట్రోల్ పోసిన యువకుడికి రిమాండ్

-

తనను ప్రేమించడం లేదనే కారణంతో యువతిపై పెట్రోల్ పోసి తానూ పోసుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని ఓ వర్గానికి చెందిన యువతిపై పెట్రోల్ పోసిన యువకుడు ప్రమోద్ కుమార్‌ను అరెస్ట్ చేసనట్లు SI ముత్తయ్య తెలిపారు.

యువతి తన బంధువుల సాయంతో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ యువకుడి నుంచి పెట్రోల్ డబ్బా, ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, యువతిపై పెట్రోల్ పోసిన సమయంలో ఓ వ్యక్తి అటుగా వచ్చి యువకుడిని పట్టుకుని రెండు దెబ్బలు వేశాడు. అనంతరం అతన్ని యువతులకు దూరంగా పంపించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version