రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహంలో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. పదో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి పడుకున్న విద్యార్థి ఉదయం లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి హాస్టల్ సిబ్బంది తరలించారు. విద్యార్థిని పరిశీలించిన వైద్యులు కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు వెల్లడించారు. దీంతో హాస్టల్ సిబ్బంది మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.