తిరుపతి మరో రికార్డు సృష్టించింది. తిరుపతిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.. రికార్డు స్థాయిలో 330కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయ్యాయి. అలాగే న్యూ ఇయర్ వేళ తాగి రోడ్డెక్కిన మందుబాబులు.. రచ్చ చేశారు.
ఆంక్షలను లెక్కచేయని మందుబాబులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరిని జైలుకు పంపారు. అటు హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విపరీతంగా జరిగాయి. నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 1,300 మందిపై కేసులు నమోదు చేశారు. పలువురు వ్యక్తులకు 500 పాయింట్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్టు కూడా ఈ టెస్టుల్లో తేలింది. ఈ డ్రైవ్‌లో ఓ వ్యక్తి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకా అని హల్ చల్ చేశాడు.