ఎస్సైతో మందుబాబుల వాగ్వాదం.. మేమెక్కడ తాగాలి సార్ అంటూ లొల్లి

-

ఇంట్లో పెళ్లాలు సతాయిస్తున్నారు.. సరేలే అని బయటకొస్తే ఇక్కడ పోలీసులు వెంటబడుతున్నారు.. ఇట్లా అయితే మేం మందు తాగేదెప్పుడు.. మాకు మందు తాగడానికి ఓ చోటు కావాలి అంటూ తిరుపతి జిల్లా వాకాడులోని మందుబాబులు తమ గోడును పోలీసుల వద్ద వెల్లబోసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన మంగళవారం రోజు రాత్రిపూ చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

స్థానికంగా ఉన్న అశోకస్తంభం వద్ద ఓ మద్యం దుకాణం ఉంది. సమీప శీతల పానీయాల దుకాణాల్లో, చర్చికి వెళ్లే మార్గంలో కొందరు మద్యం తాగుతున్నారు. వారితో ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రఘునాథ్‌ స్పందించి అక్కడికి వచ్చి మందలించారు. దీంతో మందుబాబులు ఆయనతో వాదనకు దిగారు.

‘సారూ.. మద్యం దుకాణం వద్ద తాగొద్దంటిరి. సమీపంలోని ఇతర దుకాణాల వద్దా వీల్లేదంటిరి. ఇంటికిపోతే మా పెళ్లాలు ఇంట్లో తాగొద్దంటున్నారు. ఇంకెక్కడ తాగాలో మీరే చెప్పండి సారూ..’ అంటూ ఎస్సై వద్ద వారి గోడు వెల్లబోసుకున్నారు. అక్కడినుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వారిని పోలీసులు పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news