అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన అటవీప్రాంతంలో ఏనుగుల గుంపుల దాడిలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు శివరాత్రి కావడంతో గుండాలకోన ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. మృతులు ఉర్లగడ్డపోడు వాసులుగా గుర్తించారు.