ఎల్లుండి స్వర్ణాంధ్ర-2047 విజన్ విడుదల

-

డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్-2047ను విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రం, జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని తెలిపారు. దీని ఆధారంగానే రాష్ట్రంలో పరిపాలన ఉండాలని తెలిపారు. 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకొని కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. 

ప్రతీ సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని.. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని తెలిపారు చంద్రబాబు. వైజాగ్ లో గూగుల్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖ మంచి సిటీ అని గుర్తించామని గూగుల్ వాళ్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news