పోరస్ ఫ్యాక్టరీపై ఎలాంటి ఫిర్యాదులు లేవు… అందలేదు – ఏలూరు ఎంపీ

-

ఏలూరు : పొరస్ ఫ్యాక్టరీ ఘటనపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్టరీపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదంటూనే.. ఫ్యాక్టరీ ఇక్కడ లేకున్నా నష్టమేం ఉండదని ఎంపీ కోటగిరి స్పష్టం చేశారు. పోరస్ ఫ్యాక్టరీపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని… ఎయిర్, వాటర్, గ్రౌండ్ పొల్యూషన్ ఏమైనా ఉందా..? అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలిస్తుందని వెల్లడించారు.

స్థానికుల సూచనల మేరకు ఈ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలా..? తరలించాలా..? అనే అంశం పీసీబీ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుందని.. ఈ ఫ్యాక్టరీ ఉన్న ముసునూరు మండలం వ్యవసాయాధారిత మండలం.. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ లేకున్నా పెద్దగా నష్టమేం ఉండదని వెల్లడించారు.

పొరస్ ఫ్యాక్టరీలో ప్రమాదం చాలా బాధాకరమని… ముందుగా మృతుల కుటుంబాలను ఆదుకోవడం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడం పైనే ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని పేర్కొన్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందనేది అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు సాంకేతిక లోపం కారణం అన్నట్టుగానే తేలిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version