ఏపీలోకి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఎంట్రీ

-

ఏపీలోకి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చేరుకున్నాయి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు. ఇక రేపు మరిన్ని బలగాలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Entry of 20 companies of paramilitary forces into AP

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించనున్నారు సీఈవో. అలాగే.. ఏపీలో అల్లర్లను కంట్రోలో చేయడానికి కూడా సెంట్రల్‌ పోర్స్‌ ను దింపుతున్నారు. కాగా పల్నాడు పరిధిలోని గురజాల నియోజక వర్గంలో వందకు పై గా కేసులు.. 192 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు పెట్టారు. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదు అయింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు..దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version