పోలీసులకు షాక్.. తప్పించుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి!

-

పులివెందుల ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల పోలింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి కడపకు బయలుదేరారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద వీరి వాహనాన్ని అడ్డుకున్నారు.

అవినాష్‌ రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లు గప్పి ఎర్రగుంట్ల నుంచి అవినాష్‌ రెడ్డి మరో వాహనంలో వెళ్లిపోయారు. అవినాష్‌ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అటు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పైన ఎలక్షన్ కమిషన్కు వైసిపి ఫిర్యాదు చేసింది అమరావతిలోని ఈసీ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిరసన చేపట్టారు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news