ఖజానా జ్యువెలర్స్ దోపీడీ సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. షోరూమ్ ఓపెన్ చేయగానే మాస్కులు, హెల్మెట్లతో వచ్చిన దుండగులు.. కాల్పులు జరిపారు. ఏమీ తెలియనట్లుగా, ఒకరికి ఒకరు పరిచయం లేనట్లుగా విడి విడిగా వచ్చిన దుండగులు… షాపులోకి రావడంతోనే గన్ తీసి బెదిరించారు.

కాగా హైదరాబాద్ – చందానగర్‌లో పట్టపగలే కాల్పులు జరిపి ఖజానా జువెలర్స్‌లో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు. ఖజానా జువెలర్స్ షాపు మేనేజర్ కాలుపై గన్‌తో కాల్పులు కూడా జరిపారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే దోపిడీ చేశారు దుండగులు. రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.
పట్టపగలే ఖజానా జువెలర్స్‌లో చొరబడ్డారు ఆరుగురు దుండగులు. గన్‌తో బెదిరించి లాకర్ కీస్ అడిగిన గ్యాంగ్.. ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాలుపై కాల్పులు జరిపింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేసి, బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు దుండగులు. దింతో వెంటనే పోలీసులకు కాల్ చేశారు ఖజానా జువెలర్స్ స్టాఫ్. ఇక పోలీసులను చూసి పారిపోయారు దుండగులు.
https://twitter.com/bigtvtelugu/status/1955177482304491655