ఏపీలోని 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు

-

 

 

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.88.41 కోట్ల‌తో మంగ‌ళ‌వారంనాడు న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మ‌క్షంలోఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) జి.క‌మ‌ల‌వ‌ర్ధ‌న‌రావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఇనోషి శ‌ర్మ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చొర‌వ‌తో రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌త ప్ర‌మాణాల్ని బ‌లోపేతం చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ ముందుకొచ్చింది. ఇందుకోసం పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ జి.క‌మ‌ల‌వ‌ర్ధ‌న‌రావు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

Establishment of mobile food testing labs in 22 districts of AP

ప్ర‌ధానంగా ఏపీలో ఆహార ప‌రీక్షల ప్ర‌యోగ‌శాల‌లు(Food Testing Laboratories) ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖ‌త వ్య‌క్తం చేసింది. రూ. 20 కోట్ల‌తో తిరుమ‌ల‌లోనూ, మ‌రో రూ.20 కోట్ల‌తో క‌ర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌ల‌ను నెల‌కొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్ర‌యోగ‌శాల‌ల్ని(Basic Food testing Laboratories) ఒక్కొక్క‌టి రూ. 7.5 కోట్ల‌తో మొత్తం రూ.13 కోట్ల‌తో నెల‌కొల్ప‌నున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల‌ సేక‌ర‌ణ‌, విశ్లేష‌ణ‌(Collection and Analysis) కోసం రూ.12 కోట్లు, ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ‌రెట‌రీల‌తో పాటు అద‌నంగా మ‌రో 22 ల్యాబ‌రెట‌రీల‌ను ట‌ర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీకారం కుదిరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version