వెల్లంపల్లిపై వైసీపీ మాజీ కార్పొరేటర్లు ఫైర్..!

-

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై వైసీపీ మాజీ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. విజయవాడ స్వాతి రోడ్డు లో బీజేపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. నీ పేరు వెల్లంపల్లి కాదు వసూళ్లపల్లి అని మార్చుకో. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రివెల్లంపల్లికి లేదు. పది ఏళ్లగా ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు చేసింది ఏమీ లేదు సాధించింది ఏమీ లేదు. శిలాఫలకాలికే నువ్వు పరిమితం అని అన్నారు. నువ్వు 10 ఏళ్లలో వెలగబెట్టిన దానికంటే ఐదు నెలల ఎమ్మెల్యే సుజనా చౌదరివి చేసిన పనులు చాలా ఉన్నాయని తెలుసుకోవాలి. చందాల కోసం నెలకు ఈవెంట్ కెళ్లే నువ్వు సృజనా చౌదరి లాంటి స్వచ్ఛమైన నాయకుడు గురించి విమర్శించే అర్హత లేదు.

ఐదు నెలల కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో తెలుసుకో. సుజనా చౌదరి తన సొంత నిధులతో ఏం చేశారనేది ప్రజలను అడిగితే చెబుతారు. సుజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా మెడికల్ క్యాంపులు వైద్య ఖర్చులు పేదల విద్యార్థులకు ఫీజులు లాంటివి ఎన్నో చేశారు. నువ్వు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి దందాలు చందాలు నీకు అలవాటు కాబట్టి అభివృద్ధి అంటే ఏంటో నీకు తెలియదు. సుజనా చౌదరి ప్రభుత్వంతో సంబంధం లేకుండా 42 వేల మందికి ఆహార పొట్లాలను వరద బాధితులకు అందించారు. వేల మందికి నిత్యవసర కిట్లు వీటితోపాటు చనిపోయిన వారికీ ఆర్థిక సహాయం చేసి బాధ్యతలను పరామర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అధినేత వచ్చినప్పుడు తప్ప ప్రజల్లోకి వెళ్లిన తాకలాలు లేవు. పశ్చిమ నియోజకవర్గం లో దాదాపుగా 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకొచ్చారు సృజనా చౌదరి. కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు చెక్ పెట్టి..సొంత నిధులతో 49వ డివిజన్లో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇదే మా ఎమ్మెల్యే సుజనా చౌదరి ట్రాక్ రికార్డు అని మాజీ కార్పొరేటర్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version