ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. BJP వాళ్ళు ఈ దఫా 400 సీట్లు అన్న వారు… 240 సీట్లు సాధించారు… కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది.. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు. ఇక తెలంగాణలో మేము సర్కార్ ఏర్పాటు చేయడమే కాదు.. పదేళ్లలో మోదీ ఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. బీజేపీ రహస్య జెండాను బయటపెట్టాం.. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరు.
అలాగే కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి… కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… ఇప్పుడు 20-20 ఫార్మాట్ నడుస్తోంది. మేం ఫార్మాట్ ఆడాలి. లేదా ఫార్మాట్ మార్చుకోవాలి.. బీజేపీ ఉంచడమో.. ఖతం చేయడమో తీరులో ఉంటుంది. మాకు మానవీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం.. అవసరాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజకీయాలు ఉంటాయి.. కాంగ్రెస్ తాతతండ్రులను గుర్తుపెట్టుకుంటుంది.. వారి సంక్షేమానికి కృషి చేస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.