గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చంద్రబాబు మనుషులే అంటూ జనసేనాని పవన్ కళ్యాన్ కు చురకలు అంటించారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిఠాపురం జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చాడు. ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఫైర్ అయ్యారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. 21 సీట్లు గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
టీడీపీలో టికెట్ దక్కనివారికి జనసేన టికెట్లిచ్చిందని తెలిపారు. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చంద్రబాబు మనుషులే అంటూ వ్యాఖ్యానించారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. జనసేన నిర్వాహణను చూసేది చంద్రబాబే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది.? అంటూ నిలదీశారు అంబటి రాంబాబు.