నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 గురు మృతి

-

Nellore district  : నెల్లూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా 7 గురు ప్రయాణికులు మరణించారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Fatal road accident in Nellore district 7 dead

ఎదురుగా వస్తున్న రెండు లారీలు..ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో ఏకంగా 7 గురు ప్రయాణికులు మరణించారు. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న 23 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ తరుణంలోనే… బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీయటానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా ఆగింది. ఇక క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version