ఏపీ బడ్జెట్ పై పయ్యావుల ఫోకస్ చేశారు. ఏపీ బడ్జెట్ రూపకల్పనపై ముమ్మర కసరత్తు మొదలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంత్రులు, ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు నిర్వహించనున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Finance-Minister-Payyavula-Keshav-is-holding-a-series-of-meetings-with-ministers-and-senior-officials.webp)
తమ శాఖలకు కావాల్సిన నిధులు, ప్రవేశపెట్టనున్న పథకాలను సమీక్షల్లో మంత్రి పయ్యావులకు వివరించారు ఆయా శాఖల మంత్రులు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా పయ్యావులను కోరారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల. ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసే దిశగా ఆలోచిస్తామన్నారు పయ్యావుల కేశవ్. అటు ఫ్రీ బస్సుకు నిధులు పెట్టే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నెల 24 వ తేదీ నుంచే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.