తిరుమల భక్తులకు అలర్ఠ్..దర్శనాలకు 12 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది. అటు 70169 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/ttd-1.jpg)
24559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు హుండీ ఆదాయం 4.33 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో 14వ తేదిన టిటిడి పై సీఎం చంద్రబాబు సమీక్ష ఉంటుంది. ఈ సమీక్షకు చైర్మన్ బిఆర్ నాయుడు,ఇఓ శ్యామలరావు,అదనపు ఇఓ వెంకయ్య చౌదరి
హజరు కానున్నారు. శ్రీవారి భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి పై సమిక్షించనున్నారు చంద్రబాబు. గత అక్టోబర్ లో తిరుమల అభివృద్ధి పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు… పనుల పురోగతి,భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో సమిక్షించనున్నారు.
- తిరుమల ….23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 12 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70169 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 24559 మంది భక్తులు
- హుండీ ఆదాయం 4.33 కోట్లు