అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..250 మంది కార్మికులు !

ఏపీలో అమర రాజా బ్యాటరీ పరిశ్రమకు బిగ్‌ షాక్‌ తగిలింది. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్ధానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో సోమ వారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్‌ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఆ సమయంలో.. ప్లాంట్‌ లో దాదాపు 250 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల తో మంటలను ఆర్పి వేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.