ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్టీల్ ప్లాంట్ నుంచి భారీగా మంటలు వస్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్ ఫ్లాంట్ – 2 లో ఉన్న ల్యాడిల్ కు చిన్న రంద్రం పడందని తెలుస్తుంది. అయితే ఈ రంద్రం పడటం వల్ల ఉక్కు ద్రవం బయటకు వచ్చిందని సమాచారం. ఉక్కు ద్రవం బయటకు రావడం వల్ల భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మంటలలో రెండు లారీలు దగ్ధం అయ్యాయని తెలుస్తుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కు వచ్చి మంటలు ఆదులోకి తీసుకు వస్తున్నారు. అయితే బ్లాస్ట్ ఫర్నేస్ ఫ్లాంట్ – 2 లో ఉన్న ల్యాడిల్ కు రంద్రం పడటానికి కారణం తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని స్టీల్ ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ హాని జరగలేదని తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.