తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం నెలకొంది. వేం నరేందర్ రెడ్డి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో హెలి ప్యాడ్ వద్ద ముఖ్య మంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇన్నోవా క్రిస్టా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే ఈ సంఘటన జరుగగానే సకాలంలో స్పందించింది అగ్నిమాపక సిబ్బంది. దింతో వెంటనే మంటలను ఆర్పీ వేశారు. దింతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.