జమ్మూలోని నగ్రోటా మిలిటరీ స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించింది ఆర్మీ. ఆర్మీ అధికారులపై అనుమానాస్పద వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు ఆర్మీ అధికారులు. దింతో నగ్రోటా మిలిటరీ స్టేషన్‌లో హై అలెర్ట్ ప్రకటించారు.

అటు కాల్పుల విరమణ ఒప్పందం పాక్ ఉల్లంఘించిందన్నారు విక్రమ్ మిస్రీ. గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులను ఆపడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ DGMOల మధ్య నిన్న సాయంత్రం కాల్పుల విరమణ దిశగా ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. కానీ గత కొన్ని గంటలుగా, ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని తెలిపారు.భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటును అడ్డుకుంటుందని.. పాకిస్తాన్ చొరబాటును మేము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, ఈ చొరబాటును ఆపడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామన్నారు విక్రమ్ మిస్రీ.
నగ్రోటా మిలిటరీ స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన ఆర్మీ
ఆర్మీ అధికారులపై కాల్పులు జరిపిన అనుమానాస్పద వ్యక్తులు
కాల్పుల్లో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలిపిన ఆర్మీ అధికారులు pic.twitter.com/jgku4ldHDI
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025