భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల తరుణంలో.. నెల్లూరు జిల్లాలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ సూచనలతో కావలిలో పోలీసులు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు నెల్లూరు జిల్లా పోలీసులు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలన చేశారు.

ప్రయాణికుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు నెల్లూరు పోలీసులు. కాగా మళ్లీ కాల్పులు ప్రారంభించింది పాకిస్థాన్. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ కవ్వింపు చర్యల కు పాల్పడుతోంది పాక్. శ్రీ నగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్ తో దాడులు చేస్తోంది పాకిస్థాన్. మరోవైపు, శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు.