కాల్పుల విరమణకు పాక్ బ్రేక్.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం పాక్ ఉల్లంఘించిందన్నారు విక్రమ్ మిస్రీ. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం… పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో.. సరిహద్దుల్లో పాక్ చర్యలను తిప్పికొట్టేలా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు విక్రమ్ మిస్రీ.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులను ఆపడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ DGMOల మధ్య నిన్న సాయంత్రం కాల్పుల విరమణ దిశగా ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. కానీ గత కొన్ని గంటలుగా, ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని తెలిపారు.
భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటును అడ్డుకుంటుందని.. పాకిస్తాన్ చొరబాటును మేము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, ఈ చొరబాటును ఆపడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామన్నారు విక్రమ్ మిస్రీ.