ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీ ఫిష్ వినియోగిస్తున్నారని వెల్లడించారు. ఉత్పత్తి ఎక్కువగా ఉంది… వినియోగం తక్కువగా ఉందని.. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు.
ఫిష్ ఆంధ్రా అనే బ్రాండ్ ను మరింతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని.. న్యూట్రిషన్ విలువలు ఎక్కువగా ఉండే ఆహారం అన్నారు. అయితే అందుబాటు తక్కువగా ఉంటోందని.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వినియోగదారుల్లో మరింత అవగాహన పెంచేందుకే ఈ ఫెస్టివల్ ఉద్దేశమని వివరించారు. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నామని.. తర్వాత వైజాగ్ వంటి ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తామని ప్రకటించారు ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు.