ఘాట్ కేసర్ లో దారుణం జరిగింది. స్విమ్మింగ్ పూల్ లో వేసి సాప్ట్ వేర్ ఎంప్లాయ్ హత్య చేశారు. పుట్టినరోజు వేడుకల్లో తోటి ఉద్యోగులే అతన్ని హత్య చేసినట్లు సమాచారం. ఈత రాదని చెబుతున్నప్పటికీ స్విమ్మింగ్ పూల్ లో వేసి వెళ్లిపోయారట అతని ఫ్రెండ్స్. ఇక 45 నిమిషాల పాటు ఈతకులంలో కొట్టుమిట్టాడి చనిపోయాడట సాప్ట్ వేర్ అజయ్. మద్యం మత్తులో అజయ్ ని సిమ్మింగ్ పూల్ లో పడవేశారట తోటి మిత్రులు.
దీంతో ఘట్ కేసర్ పరిధిలో విల్లాలో పుట్టిన రోజు వేడుకలో విషాదం నెలకొంది. మాదాపూర్ లో ఓ ఐటీ సంస్థలో మేనేజర్ గా పని చేసే శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఘట్ కేసర్ మండలం ఘనపూర్ లోని గెస్ట్ హౌస్ లో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఉద్యోగులు హాజరు అయ్యారు. ఈ తరునంలోనే సాప్ట్ వేర్ అజయ్ హత్య జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.