Breaking : ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..

-

ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ను ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని నివాసంలో మాజీ మంత్రి నారాయణ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం నారాయణను ఏపీకి తరలించినట్లు సమాచారం అందుతోంది.

అయితే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేశారని దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పదవ తరగతి పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news