ఇవాళ జనసేనలోకి బాలినేని..పవన్‌ తో కీలక సమావేశం !

-

Balineni Srinivasa Reddy: ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ జనసేనలోకి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లనున్నారని సమాచారం. ఇందులో భాగంగానే… ఇవాళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు.

Former minister Balineni Srinivasa Reddy met Jana Sena leader and Deputy CM Pawan Kalyan today

ఇవాళ ఉదయం 11 గంటలకు మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. అటు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..గత కొద్దికాలంగా పార్టీ అధినేత జగన్ పై అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ పార్టీ లోని కోటరీ వల్లే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే తేదీని ప్రకటించనున్నారు బాలినేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version