తిరుమల లడ్డుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం – టీటీడీ మాజీ ఛైర్మన్‌

-

తిరుమల లడ్డుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అంటూ టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహించారు. తిరుమల మహా ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు అంటూ ఫైర్‌ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదన్నారు.

Former TTD Chairman Bhumana Karunakar Reddy was angry with Chandrababu’s comments on Tirumala Laddu as evil

ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి.. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని నిప్పులు చెరిగారు టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతానని మరోమారు నిరూపించారన్నారు. అలిపిరి ఘటనలో దేవదేవుడి దయ వల్లే బతికి బయటపడి ఇప్పుడిలా దారుణ వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. ఇలా అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనమవుతారని హెచ్చరించారు. తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version