వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. వైసీపీలో ‘ స్క్రాప్ “వెళ్ళిపోతోందని చురకలు అంటించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో మంత్రి పదవి తీసుకున్న అవంతి శ్రీనివాస్ నిరసనలు చెయ్యమని చెబితే ఎందుకు ఇబ్బందంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
5 ఏళ్ల 8 నెలల్లో అవంతి శ్రీనివాస్ వల్ల వైసిపికి జరిగిన కంట్రిబ్యూషన్ ఏంటి చెప్పాలి అంటూ ఆగ్రహించారు. రాజీనామా చేసిన వాళ్ళు….చెయ్యాలి అనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి అంటూ రెచ్చిపోయారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి ఒక మ్యాను ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ……ఒక ఎంపీ, ఎమ్మెల్యే తో మొదలెట్టి అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక నిన్న వైసీపీ పార్టీలో రెండు వికెట్లు పడిన సంగతి తెలిసిందే. అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఇద్దరూ కూడా రాజీనామా చేశారు.