బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. ఆమె మామ రామ్‌కిషన్ రావుపై శుక్రవారం తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న భూమి విషయంలో రామ్‌కిషన్ రావు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బంధువు అయిన నగేశ్ కుమార్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే, అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న రహదారిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా రామ్‌కిషన్ రావు అనుచరులు తమను నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ.. దాడి చేసేందుకు ప్రయత్నించారని అపొజిట్ వక్తులు ఆరోపించారు. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే గోపీ అనే వ్యక్తి ఇటీవల రామకిషన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రామ్‌కిషన్ రావు, మాజీ కార్పొరేటర్ భర్త సుదామ్ రామ్‌చంద్, నగేశ్, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ రూరల్ పోలీసులు తెలిపారు.